hampi.in

Everything About Hampi!
read this page on mobile

హంపి! భారతదేశం!

మధ్యయుగంనాటి విజయనగర సామ్రాజ్యపు రాజధాని హంపి! ప్రఖ్యాతి గాంచిన ఈ పట్టణం ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అంతర్జాతీయ విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది హంపి.

హంపీ నగరం శిధిలమైనప్పటికీ, దాని ఆకర్షణ ఏమాత్రం తరగలేదు. ప్రతి సంవత్సరమూ వేలాది మంది పర్యాటకుల్ని, యాత్రికుల్ని హంపి తనవద్దకు రప్పించుకుంటున్నది. గండ శిలలతో నిండిన విస్తారమైన పర్వత శ్రేణులు హంపీకి పృష్ఠభూమిగా నిలచి దానికొక ప్రత్యేకతనాపాదిస్తున్నాయి.

పర్వతాలు, లోయల నడుమన పరచుకొని ఐదువందలకు పైగా కట్టడాలున్నాయి. అందమైన దేవాలయాలు, సుందరమైన రాజప్రాసాదాలు, జలాశయాల శిధిలాలు, పురాతన వణిజ వీధులు, రాచ మండపాలు, బురుజులు, నాట్యకళారంగాలు, కోశాగార భవనాలు... ఇంకెన్నో లెక్కలేనన్ని కమనీయ నిర్మాణాలు, దర్శనీయ ప్రదేశాలున్నాయి ఇక్కడ. హంపి పర్యాటకుల స్వర్గం; యాత్రికుల హర్షదాయిని.

హంపిలో ఒక్కొక్క మలుపునా ఒక్కొక్క అద్భుత దృశ్యకావ్యం సాక్షాత్కరించి విస్మయాన్ని గొలుపుతుంది. ప్రతి కట్టడమూ బహిర్గతపరచేదానికి అనేక రెట్ల రహస్యాన్ని తనలోనే దాచుకొని లోతు కనుక్కోమంటుంది. పురాతన కట్టడాల ప్రదర్శనశాలయైన హంపిలో వందకు పైగా కట్టడాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

హంపి శిధిలాల కోసం ఈ వెబ్ సైటును చూడండి: www.hampi.in

హంపి గురించిన విస్తృత సమచారం www.hampi.in లో పొందుపరచబడింది. అనేక కట్టడాల వివరాలు, వాటి ఫొటోలు, మీరు ప్రింట్ చేసుకునేందుకు వీలైన హంపి శిధిలాల మ్యాప్, మీ హంపి యాత్ర విజయవంతమయ్యేందుకు కొన్ని చిట్కాలు, హోటళ్ల వివరాలు, యాత్రా మార్గానికి సంబంధించిన ముందస్తు ప్రణాలికలు మొదలైనవి మీకు ఇక్కడ లభిస్తాయి.

w

ww.hampi.in లోని ప్రధాన వెబ్ పేజీలన్నీ ఇంగ్లీషులో ఉంటాయి. కానీ అనేక మ్యాపులు, చాలా ఫొటోలతో ఈ వెబ్ సైట్ అందరు పాఠకులకూ అనువుగా ఉంటుంది.

తెలుగు స్వేచ్ఛానువాదం : నారాయణ.

hampi.in

Everything About Hampi!
--
Vijayanagara Coinage
--
Festivals

List of festivals in Hampi & months

--
Hampi Ruin
--
Hampi Photos
--
Hampi Photos 1

The landscape of Hampi is filled with unending array of carvings. Some may want to call it an open museum. The carvings of religious as well as secular theme are carved on boulders in its natural settings as well as into the manmade structures. The following depicts a sample collection of such images....

1

हंपी, भारत!

1